BRS మహిళా విభాగం ఆధ్వర్యంలో HYDలోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు KTR తెలిపారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఈ నెల 24న ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం సా.4 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. బతుకమ్మ సంబరాలకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ కార్యకర్తలు తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa