తుర్కాయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి వద్ద కాలనీ మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, తెలంగాణ పండుగగా జరుపుకునే బతుకమ్మను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa