నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు గురువారం రెండో రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa