TG: వికారాబాద్ జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర రూపం దాల్చాయి. యాలాల మండలం బెన్నూర్‌లో కృష్ణ అనే వ్యక్తి తన కూతురుని కర్ణాటకకు చెందిన అర్జున్‌కు ఇచ్చి వివాహం చేశాడు. అయితే మామ పేరుపై ఉన్న 2 ఎకరాల పొలం, ఇల్లు తమకు ఇవ్వాలని అల్లుడు, కూతురు, కృష్ణ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో అర్జున్ తన మామ కృష్ణపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa