కూకట్పల్లి నియోజకవర్గంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ సంస్మరణ కార్యక్రమాన్ని బాలానగర్ పోలీస్ స్టేషన్ లో సీఐ నర్సింహా రాజు నేతృత్వంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి సీఐ ‘వందే మాతరం’ పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపించారు. అనంతరం బంకించంద్ర ఛటర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సరితా రెడ్డి, హాజీ మియా, వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa