ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలానగర్ పోలీస్ స్టేషన్ లో వందే మాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 12:48 PM

కూకట్‌పల్లి నియోజకవర్గంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ సంస్మరణ కార్యక్రమాన్ని బాలానగర్ పోలీస్ స్టేషన్ లో సీఐ నర్సింహా రాజు నేతృత్వంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి సీఐ ‘వందే మాతరం’ పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపించారు. అనంతరం బంకించంద్ర ఛటర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సరితా రెడ్డి, హాజీ మియా, వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa