తెలంగాణ రాష్ట్రానికి ఏఐసీసీ సెక్రటరీగా మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు సచిన్ సావంత్ నియమితులయ్యారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏఐసీసీ సెక్రటరీగా ఉన్న విశ్వనాథంతో పాటు సచిన్ కూడా సహాయకులుగా ఉంటారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కేడర్‌ను బలోపేతం చేసేందుకు ఈ నియామకం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa