ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే కేబినెట్ సమావేశం.. స్థానిక ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 06:27 PM

TG: సీఎం రేవంత్​ అధ్యక్షతన ఈ నెల 17న (సోమవారం) కేబినెట్ ​సమావేశం జరగనుంది. ఈ క్రమంలో 'స్థానిక' ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే స్థానిక ఎన్నికల అంశం ఈ నెల 24న హైకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా కోర్టుకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. దీంతో కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించి.. ముందుగా సర్పంచ్​ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa