బాన్సువాడలో ఆదివారం మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డివిజన్ అడహాక్ కమిటీ ఎన్నికలు జరిగాయి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్, జిల్లా నాయకుల పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో మల్లూరి సాయిలు అధ్యక్షుడిగా, దొనకంటి బ్రహ్మానందం ఉపాధ్యక్షుడిగా, పాండురంగం కార్యదర్శిగా, క్యాకయ్య సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాలసాయిలు, గైనీ రవి కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. మాలల ఐక్యత, అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa