TG: ఆశ్రమ పాఠశాలలో బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్ పల్లి ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ గా విధులు నిర్వర్తిస్తున్న జి.ఆనందరావు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ పాఠశాలను సందర్శించిన షీ టీమ్ అవగాహన కార్యక్రమం సందర్భంగా బాలికలు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు.. బేల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆనందరావుపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం రిమాండ్ కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa