ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ భాగంగా హైదరాబాద్‌కు చెందిన 25 మంది ప్రత్యేక పోలీసు బృందం వరంగల్ కోట, వేయి స్తంభాల ఆలయం, ఏకశిలగుట్ట, ఖుష్ మహల్, స్వయంభు దేవాలయం వంటి కీలక ప్రదేశాల్లో రెక్కీ చేసింది. పురావస్తు శాఖతో కలిసి భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, భౌగోళిక పరిస్థితులను పరిశీలించారు. కాకతీయుల చరిత్ర, శిల్పకళపై సమాచారం సేకరించి, గుర్తించిన భద్రతా లోపాల నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa