ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోశామహల్ చాక్నవాడిలో కుంగిన ఐదు అంతస్థుల భవనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 03:52 PM

హైదరాబాద్‌లోని గోషామహల్ సమీపంలో నూతన భవన నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాలతో, ఆనుకొని ఉన్న ఐదు అంతస్తుల భవనానికి పెద్ద బీటలు వారాయి. ఈ విషయంపై హెచ్‌ఎంసి అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. గతంలో ఇదే ప్రాంతంలో పలుమార్లు నాలాలు కుంగిపోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో చుట్టుపక్కల స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa