సికింద్రాబాద్ శివాజీ నగర్ కోనేరు వీధిలోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం దేవాలయ ప్రాంగణంలో ఆలయ అధికారులచే నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను వేద పండితులచే ఘనంగా స్వాగతించి, వేదాశీర్వచనం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa