తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంపై ఎమ్మెల్యేలపై విచారణలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరో షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో మిగిలిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. ఈ నెల 19న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, 20న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను ఎదుర్కోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa