ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 11:57 AM

ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 28 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతులు స్వీకరించి, సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీసు సేవలు అందజేయాలని అధికారులకు ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa