స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల, అగ్రహారం నందు కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శంకర్ మాట్లాడుతూ, యువత డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టీ. లావణ్య, యాంటీ డ్రగ్స్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ కే. వై. కరుణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ. ప్రసాద్, గోపి కృష్ణ అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa