బంగారం, వెండి ధరలు పగ్గాలు లేకుండా పెరిగిపోతున్నాయి. ఈరోజు పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ఆల్-టైమ్ గరిష్ఠాలకు చేరువయ్యాయి. ఈ ధరల పెరుగుదలతో సామాన్యులకు బంగారం, వెండి మరింత భారంగా మారనుంది. హైదరాబాద్ మార్కెట్లో ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,360 పెరిగింది. దీంతో దాని ధర రూ.1,29,820కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,250 పెరిగి, దాని తుది ధర రూ.1,19,000గా నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa