మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 కు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. వివిధ రంగాల నిపుణులు, పెట్టుబడిదారులకు మూడంచెల భద్రత కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. పాస్ లున్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, విదేశాల నుంచి 1300 మంది, జాతీయ స్థాయి ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారని లక్ష్మారెడ్డి తెలిపారు. సమ్మిట్ తర్వాత రాష్ట్ర అగ్రనాయకత్వం పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుస్తుందని, ఈ అంతర్జాతీయ వేడుకకు కాంగ్రెస్ సేనలు సహకరించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa