వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గం ఏజెంట్ ఓటర్లను తమకు మద్దతు ఇవ్వాలని కోరగా, మరో వర్గం ఏజెంట్ దీనిని బయటపెట్టడంతో సర్పంచ్ అభ్యర్థులు చిలకమర్రి వెంకటయ్య, బోయిని రాములు మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో సర్పంచ్ అభ్యర్థి బోయిని రాములు గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాంగ్రెస్ వర్గీయుడు సాయిరాం కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa