కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ప్రతినిధి సూర్య అందించిన సమాచారం ప్రకారం, బిచ్కుంద మండలం పెద్ద దేవాడ గ్రామ పంచాయతీ సెక్రెటరీ ప్రేసిల్ల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ శ్రీమతి శోభ/గంగాధర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శోభ మాట్లాడుతూ, గ్రామానికి సంబంధించిన ఏ విషయంలోనైనా తాను ఎల్లప్పుడూ స్పందిస్తానని గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారుతి, వార్డు సభ్యులు, గ్రామ యువత, ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa