తెలంగాణలో నీళ్ల రాజకీయం వేడెక్కింది. కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడాన్ని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో నేడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హరీశ్ రావు, కేటీఆర్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa