ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటిముందు మృతదేహంతో ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 10:33 AM

TG:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన సరస్వతి(22) ఈ నెల 4న HYD మీర్ పేట పీఎస్ పరిధిలోని ఓ హాస్టల్లో ఉరేసుకుని మృతి చెందింది. సరస్వతి, తన గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరగా అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెంది తమ కూతురు మృతి చెందిందని, ఇందుకు ప్రేమించిన యువకుడే కారణమని ఆరోపిస్తూ మంగళవారం ఆ యువకుడి ఇంటి ఎదుట మృతదేహంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa