ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివరాంపల్లి వద్ద మినీ లారీ బోల్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 11:44 AM

బుధవారం ఉదయం ఆరాంఘర్ నుంచి అత్తాపూర్ వైపు ఇటుక లోడుతో వెళ్తున్న మినీ లారీ శివరాంపల్లి వద్ద టైరు పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన ఇటుకలను తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa