ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కవిత రాజీనామాను ఆమోదించిన శాసనమండలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 01:09 PM

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి వి. నర్సింహాచార్యులు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత, పార్టీ అగ్రనేతలతో విభేదాల నేపథ్యంలో కొంతకాలంగా బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు.పార్టీలోని కీలక నేతలు హరీశ్‌రావు, సంతోష్‌రావులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో గత సెప్టెంబరులో బీఆర్ఎస్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ వెంటనే కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం స్వయంగా మండలికి వచ్చిన ఆమె తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. దీంతో బీఆర్ఎస్‌తో ఆమెకు ఉన్న సుదీర్ఘ అనుబంధం అధికారికంగా ముగిసినట్లయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa