ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయోగి స్టేడియంలో 26వ జాతీయ స్కే ఛాంపియన్‌షిప్ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 06:29 PM

గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో 26వ జాతీయ 'స్కే' (SQAY) ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొనగా, పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa