TG: రంగారెడ్డి జిల్లా మోకిలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగిల్చింది. కాగా ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు. ప్రమాద ధాటికి కారు నుజ్జు నుజ్జయింది. వాహనంలో ఐదుగురు విద్యార్థులు ఉండగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నక్షత్ర అనే అమ్మాయి తీవ్రగాయాలతో బయటపడగా ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa