హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ అంబేడ్కర్ విగ్రహం పక్కన సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 12న ముగ్గుల పోటీలు, పతంగుల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొంటారని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa