హైదరాబాద్లో భారీగా నిషేధిత చైనా మాంజాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.2 కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు ఈ చైనా మాంజాను తెప్పించి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ, పతంగులు ఎగురవేసే సమయంలో ఇది తెగి గాలిలో వేలాడుతూ వాహనదారులకు ప్రమాదాలు కలిగిస్తోందని, ఈ నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa