రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. ఈ పథకం కింద, రైతులకు ట్రాక్టర్లు, వరికొత మిషన్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళా రైతులకు 50%, ఇతర రైతులకు 40% సబ్సిడీ లభించనుంది. రూ.100 కోట్ల వ్యయంతో సుమారు 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఈ పథకం అమలు చేయబడుతోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa