కంది మండలం ఎర్దనూరు గ్రామంలో గురువారం చౌడమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. అగ్గిగుండాలు, గొలుసు తెంపడం, ఒగ్గుకథ వంటి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ జ్యోతి దుర్గా ప్రసాద్, గ్రామస్థులు, భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa