ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెక్చరర్ల ఒత్తిడి.. ఇంటర్ విద్యార్థిని మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 01:41 PM

TG: సికింద్రాబాద్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని వర్షిణి మృతి చెందింది. జనవరి 8న కాలేజీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన ఆమె, తలనొప్పి రావడంతో కింద పడిపోయింది. మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే, కాలేజీకి ఆలస్యంగా రావడంతో లెక్చరర్లు తరగతులకు అనుమతించకుండా, దురుసుగా తిట్టడంతో మనస్తాపానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa