భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అశ్వరావుపేట మండలం ఊట్లపల్లికి చెందిన 12 ఏళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలో బాలికను పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. అయితే 25 ఏళ్ల కామాంధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు చైల్డ్ డెవలప్‌మెంట్ శాఖకు సమాచారం అందించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa