ట్రెండింగ్
Epaper    English    தமிழ்

YPR కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు: విద్యార్థుల కేరింతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 03:02 PM

మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గంలోని హవెలి ఘనపూర్ మండల కేంద్రంలో గల YPR బి.ఎడ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు కలిసి గాలిపటాలు ఎగురవేశారు. బాలికలు రంగురంగుల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీలో విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేదప్రకాష్, సంసన్ బానీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa