ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదగిరిగుట్టలో AICC జనరల్ సెక్రెటరీ విష్వనాథన్ ప్రత్యేక పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 02:55 PM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని AICC జనరల్ సెక్రటరీ,కాంచీపురం మాజీ ఎంపీ శ్రీ విష్వనాథన్ గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ దర్శన కార్యక్రమంలో ఆలయ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, సమృద్ధి కలగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.అనంతరం బీర్ల అయిలయ్య గారి స్వగృహంలో విష్వనాథన్ గారికి కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa