ట్రెండింగ్
Epaper    English    தமிழ்

GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 10:49 AM

GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ గారిని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గారిని శాలువాతో సన్మానించి, 270–బీరంగూడ, 271–అమీన్‌పూర్ డివిజన్ల పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ సమస్యలు, త్రాగునీటి సరఫరా, వర్షపు నీటి నిర్వహణ, చెరువుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని కమిషనర్ గారికి అందజేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa