TG: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లో నిజామాబాద్, ఖమ్మం జిల్లా నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభంలో నెట్టిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa