సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 8న సెక్రెటేరియేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి సీఎంకు వివరిస్తుండగా.. ఇద్దరు విద్యాశాఖ మహిళా అధికారులు ‘ఇది అజెండాలో లేని విషయం.. దీనిపై ఇప్పుడు చర్చ వద్దు’ అంటూ దాటేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అలా ఎలా మాట్లాడుతారని వారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సన్నద్ధత లేకుండా సమీక్షలకు ఎలా వస్తారని ఆయన నిలదీసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa