ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 11:55 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామ పంచాయతీ జిన్నా అనూషతో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు. గృహప్రవేశం చేసిన దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa