పెద్దపల్లి జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగాలని, సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరినీ ఉత్తేజపరచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అల్వాల రాజేందర్ తో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. పలువురు బీసీ జేఏసీ కన్వీనర్లు, మహిళలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa