ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకానంద 163వ జయంతి: ఎమ్మెల్యే విజయరమణ రావు నివాళులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 03:13 PM

సుల్తానాబాద్ పట్టణంలో సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద తన బోధనలతో భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారని, నేటి యువతకు ఆయన ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa