తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 18న మేడారంలో జరిగే అవకాశం ఉంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 18వ తేదీ ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ అనంతరం, మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. రాత్రి మేడారంలోనే సీఎం రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. 19వ తేదీ ఉదయం సమ్మక్క-సారలమ్మ నూతన ప్రాంగణాలను ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa