ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేరిట ఆయన అభిమానులు మంగళవారం పట్టణంలోని మినీ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ క్రీడలను ప్రారంభించి, యువత క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, స్ఫూర్తిదాయకంగా ఆడి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే స్వయంగా బ్యాటు పట్టి బంతులను ఎదుర్కొని పరుగులు సాధించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa