ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ.. అభ్యర్థులు సిద్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 04:11 PM

TG: రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ నేత మాదిరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతుందన్నారు. ప్రజలకు జవాబుదారీతనం కలిగిన పాలన అందించడమే పార్టీ లక్ష్యమని, గెలుపే లక్ష్యంగా జనసైనికులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa