TG: వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పై పలువురు నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. ఈ విషయమై సీఎంకు లేఖ రాశానన్నారు. చలాన్లకు పెట్టాలనుకున్న ఆటో డెబిట్ సిస్టమ్ పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని అన్నారు. ఏదైనా పాలసీ గురించి మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా సీఎం మాట్లాడుతారా.. లేదా ఊరికే వచ్చి ఏదిపడితే అది మాట్లాడటమేనా అని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa