పటాన్చెరు : ముత్తంగి డివిజన్ పరిధిలోని సాయి ప్రియ కాలనీలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని సీనియర్ నాయకులు ఆబేద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి.. అత్యుత్తమ ముగ్గులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి ఎం ఆర్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్ల ఆబేద్ ను అభినందించారు. బహుమతులు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa