హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి రాజీవ్‌గాంధీ నగర్లో మంగళవారం(జనవరి 13) రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. భారీ మంటల ఎగసిపడటం స్థానిక నివాసుల్లో భయాందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa