అమరచింత పట్టణంలో 10.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని, అయితే అమరచింత మండలంలో ఇప్పటికే 300 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, పూర్తయితే మరో 300 ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు 6 కిలోల బియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఘనత అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa