కొమరం భీమ్ జిల్లాను పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించాలని ప్రయత్నిస్తోందని, అలా చేస్తే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని బీజేపీ జిల్లా కన్వీనర్ కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4000 పెన్షన్, నిరుద్యోగులకు రూ.4000, విద్యార్థినులకు స్కూటీలు, రూ.500కు గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని, బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa