ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాదె ఇన్నయ్య నివాసంలో ఎన్ఐఏ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 11:52 AM

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య నివాసం, ఆశ్రమంలో మంగళవారం ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్​గడ్​ మండలం సాగరంలోని ఇన్నయ్య ఇంటితోపాటు జాఫర్​గడ్​లోని ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.40 వరకు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో భాగంగా ఆశ్రమం నుంచి కీలక పత్రాలు, బ్యాంకు పాస్​బుక్​లు, డైరీలు, ఐఫోన్, ల్యాప్​లాప్​లు, భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇన్నయ్య తల్లిదండ్రుల వద్ద ఉన్న రూ.లక్ష నగదును కూడా అధికారులు సీజ్​ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa