సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య నివాసం, ఆశ్రమంలో మంగళవారం ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం సాగరంలోని ఇన్నయ్య ఇంటితోపాటు జాఫర్గడ్లోని ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.40 వరకు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో భాగంగా ఆశ్రమం నుంచి కీలక పత్రాలు, బ్యాంకు పాస్బుక్లు, డైరీలు, ఐఫోన్, ల్యాప్లాప్లు, భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇన్నయ్య తల్లిదండ్రుల వద్ద ఉన్న రూ.లక్ష నగదును కూడా అధికారులు సీజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa